Wednesday, January 8, 2025

పుష్ప-2 సినిమా విడుదల… సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట… మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్ టిసి క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. పుష్ప 2 విడుదల కావడంతో పాటు హీరో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది. మృతురాలు దిల్‍సుఖ్‍నగర్‌కు చెందిన రేవతి(39)గా గుర్తించారు. ఆమె కుమారుడు శ్రీతేజ(9) కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త, కుమారుడు, కుమార్తెతో కలిసి రేవతి సంధ్య థియేటర్ కు వచ్చింది. పుష్ప-2 ప్రీమియర్ షో కోసం సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్‌ను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు తోసుకుంటూ వచ్చారు. పరిస్థితి కట్టడి చేసేందుకు అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. పోలీసులు చెదరగొట్టే సమయంలోనే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట సమయంలో మహిళ, బాలుడు సొమ్మసిల్లిపడిపోయారు. అస్వస్థతకు గురైన బాలుడికి పోలీసులు సిపిఆర్ చేశారు. వెంటనే గాయపడిన మహిళ, బాలుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి రేవతి మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News