Monday, December 23, 2024

సెప్టెంబర్‌లోనే ‘పుష్ప2’ షురూ..

- Advertisement -
- Advertisement -

Pushpa 2 movie shoot will start from Sep

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ బ్యూటీ రష్మికా మందన్నా హీరోయిన్‌గా, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా భారీ హిట్ చిత్రం ‘పుష్ప’ భారీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప2’ కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరమైర అప్డేట్ ఇచ్చారు. “ప్రస్తుతానికి సినిమాలో మూడు పాటలు పూర్తయ్యాయి. ఈ సినిమా షూటింగ్‌ని సెప్టెంబర్ నుంచే స్టార్ట్ చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నామని దేవిశ్రీ తెలిపాడు”. దీంతో ఈ ఆసక్తికరమైన అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. మైత్రిమూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘పుష్ప 2’లో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటించనున్నారు.

Pushpa 2 movie shoot will start from Sep

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News