Saturday, December 28, 2024

పుష్ప-2 మూవీ టికెట్ రేట్టు భారీగా పెంపు!

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప 2 మూవీ మేనియా నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో నవంబర్ 17న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెత్ తో రూపొందించిన ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.

టికెట్ రేట్లు పెంచేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రూ.150-200 ఉన్న టికెట్ రేటును రూ.300కు పెంచేందుకు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేకర్స్ అనుమతి కోరునున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News