Monday, December 23, 2024

రికార్డు స్థాయిలో ‘పుష్ప2’ విడుదల..!

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టు ‘పుష్ప: ది రూల్‌’ కోసం అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ ఘన విజయం సాధించడంతో రెండో పార్ట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను ఏకంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా ‘పుష్ప2’ నిలవనుంది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇన్ని థియేటర్లలో రిలీజ్ కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News