Monday, December 23, 2024

అభిమానులకు గుడ్ న్యూస్..’పుష్ప2′ రిలీజ్ డేట్ మారింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ సినిమా విడుదల తేదీని మరోసారి మేకర్స్ మార్చారు. డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ హైదరాబాద్ లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.

సినిమా చిత్రీకరణకు సంబంధించిన పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పుష్ప మూవీని ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీలో రష్మిక కథానాయిక నటిస్తుండగా.. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News