Thursday, December 19, 2024

పుష్ప అంటే.. వైల్డ్ ఫైర్.. ట్రైలర్ కు రికార్డు వ్యూస్

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. పాట్నాలో జరిగిన కార్యక్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా… ఇకనుండి వైల్డ్ ఫైర్. మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రాబోతోంది. అందరికీ నచ్చుతుంది‘ అని అన్నారు.

హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ ‘ఈ చిత్రం మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది అని నేను చెప్పగలను. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నాను‘అని తెలిపారు.

మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నెని మాట్లాడుతూ ’ఈ చిత్రం ఇంతటి విజయవంతమైన ప్రయాణం కావడానికి ముఖ్య కారణంఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేసారు. దానికి నాకు ఎంత సంతోషంగా ఉంది‘అని అన్నారు. ఈ కార్యక్రమంలో రవి శంకర్, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News