Sunday, December 22, 2024

పుష్ప 2 ట్రైలర్ ఆప్డేట్.. ఏడు ప్రధాన నగరాలలో ఈవెంట్

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప 2ః ది రూల్. ఈ భారీ సినిమా నుంచి బిగ్ ట్రీట్‌గా ట్రైలర్‌ని తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ ట్రైలర్ మరి కొన్ని రోజుల్లోనే రానుందని తెలిసింది. దేశంలోని ప్రధాన నగరాలైన పాట్నా, కోల్‌కతా, చెన్నై, కోచి, బెంగుళూర్, ముంబయ్, హైదరాబాద్‌లలో ఈ ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమాలో చివరగా ఐటమ్ సాంగ్ షూటింగ్ ఒక్కటి మిగిలి ఉంది. మరి ఈ సాంగ్ ఏంటి, ఈసారి ఎవరు కనిపిస్తారు అనేది ఆసక్తిగా మారింది. అయితే శ్రీలీలతో బన్నీ ఆన్‌లోకేషన్ ఫొటో ఒకటి లీక్ అయ్యి వైరల్‌గా మారింది. దీంతో మేకర్స్ ఈ సాంగ్ తాలూకా లిరిక్ కూడా ఇచ్చేశారు. ఈ సాంగ్ ‘కిస్సిక్..’ అంటూ సాగుతుంది అని, ఇది సాంగ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేశారు. మొత్తానికి ఈ ఐటమ్ సాంగ్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News