Sunday, January 19, 2025

‘పుష్ప 2’ సినిమా షురూ

- Advertisement -
- Advertisement -

Pushpa 2 Regular shooting soon

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విలక్షణ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప ది రైజ్’ బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక తాజాగా పుష్ప సీక్వెల్ పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన తారాగణంగా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News