- Advertisement -
ఇండియన్ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ రూల్ సరికొత్త అధ్యాయం.. మరో చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం 32 రోజుల్లోనే భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికంగా 1831 కోట్లు వసూలు చేసిన చిత్రంగా, ఇండియన్ నెంబర్‌వన్ ఫిల్మ్‌గా ’పుష్ప-2’ ది రూల్ నిలిచింది. భారతీయులు గర్వించదగ్గ చిత్రం ’బాహుబలి -2’ వసూళ్లను పుష్ప- 2 అధిగమించిన విషయం తెలిసిందే. ఇక ఈనెల 11 నుంచి పుష్ప -2 రీ లోడెడ్ వర్షన్.. పుష్ప- 2కు మరో ఇరవై నిమిషాల పవర్‌ఫుల్ ఫుటెజ్‌ను జత చేస్తున్నారు.
ది వైల్డ్ ఫైర్ మరింత ఎక్స్‌ట్రా ఫైరీగా మారబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా మంగళవారం ప్రకటించారు మేకర్స్. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల కలయికలో రూపొందిన పుష్ప -2 ది రూల్ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్… సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి నిర్మించింది.
- Advertisement -