Tuesday, December 3, 2024

అల్లు అర్జున్ కి వెన్ను నొప్పి: ‘పుష్ప-2’ షూటింగ్ కు బ్రేక్

- Advertisement -
- Advertisement -

పుష్ప2 రిలీజ్ కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మూవీలోని అల్లు అర్జున్ స్టిల్స్ ఇప్పటికే బయటకు రావడంతో అభిమానులు రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. బన్నీ పక్కన రష్మిక మందన్నా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. కాంతారా సినిమాలో హీరో రిషబ్ శెట్టి పోషించిన భూతకోల పాత్ర తరహాలో ఉన్న అల్లు అర్జున్ స్టిల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వేషంలో అర్జున్ పై ఒక పాట, కొన్ని పైట్ సీక్వెన్సులు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. అయితే భారీ కాస్ట్యూమ్స్, మెడలో నిమ్మకాయల దండ వంటివి ధరించి షూటింగ్ లో పాల్గొనడం వల్ల బన్నీ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అయినా షూటింగ్ కొనసాగించేందుకే పట్టుబట్టినా, దర్శకుడు సుకుమార్ మాత్రం షూటింగ్ ను వాయిదా వేసినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News