Thursday, December 26, 2024

రేవతి కుటుంబానికి రూ.2కోట్ల సాయం

- Advertisement -
- Advertisement -

రూ.కోటి ఇచ్చిన హీరో
అల్లు అర్జున్, దర్శక,
నిర్మాతలు చెరో రూ.50లక్షలు
నేడు సిఎంతో సినీ ప్రముఖుల
భేటీ కమాండ్ కంట్రోల్
సెంటర్‌లో సమావేశం
సంధ్య థియేటర్
ఘటనపై దుష్ప్రచారం
చేస్తే కఠిన చర్యలు
పోలీసుల హెచ్చరిక

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్ సం ధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కు టుంబానికి పుష్ప-2 సినిమా బృందంసంయుక్తంగా బు ధవారం రూ.2 కోట్ల చెక్కును అందజేసింది. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కు టుంబాన్ని రాష్ట్ర ఫిలిమ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ చై ర్మన్ దిల్‌రాజు, అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్, పుష్ప- -2 నిర్మాత రవిశంకర్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులను, శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ను అడిగి అతన్ని ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు. మృతురాలు రేవతి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హీరో
అల్లు అర్జున్ తరపున రూ.1 కోటి, పుష్ప2 దర్శకుడు సుకుమార్,

నిర్మాత చెరో రూ.50 లక్షలు చొప్పున మరో కోటి మొత్తంగా రూ. 2 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేసినట్టు దిల్‌రాజు తెలిపారు. శ్రీతేజ్ త్వరలోనే కోలుకోవాలని అల్లు అరవింద్ అన్నారు. దిల్ రాజు, పుష్ప 2 నిర్మాత రవి శంకర్‌లతో కలిసి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ, అనుకోని విపత్తు జరిగిందన్నారు. శ్రీతేజ్ వేగంగా కోలుకుంటున్నాడని అన్నారు. లీగల్ కారణాలతో రేవత్ కుటుంబాన్ని వెంటనే కలవలేకపోయామని, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని శ్రీతేజ్ ను పరామర్శించినట్టు అల్లు అరవింద్ తెలిపారు. త్వరలోనే బాలుడు కోలుకుని ఆరోగ్యంగా తిరుగుతాడు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఇదే ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నేడు సిఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినీ ప్రముఖులు నేటి ఉదయం 9.45గంటలకు సిఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. కాగా, ఈ సమావేశం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో జరుగనుండగా ఈ సమావేశానికి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్‌తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానుండగా ప్రభుత్వం నుంచి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నట్లుగా తెలిసింది. బుధవారం మీడియాతో దిల్ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న సమస్యల నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డితో చర్చించడానికి తాము నిర్ణయించుకున్నామని దీనికి సంబంధించి సిఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరామని ఆయన తెలిపారు.

దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు
కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ‘పుష్ప 2 హీరో అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటన పై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినా కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తాం. ఒక అమాయకురాలు ప్రాణాలు కోల్పోయింది, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News