‘పుష్ప: ది రైజ్’ సినిమా విజయవంతం అయ్యాక, దాని సీక్వెల్ గా వచ్చిన చిత్రమే ‘పుష్ప2: ది రూల్’. ఈ సినిమా గురించి గొప్పగా చెప్పినప్పటికీ, ఊదరగొట్టినప్పటికీ అంతగా ఏమి లేదు. అయితే అల్లు అర్జున్ నటనలో వంకపెట్టేందుకు ఏమిలేదు. బాగా నటించాడు.
పుష్ప2 సినిమా జపాన్ లో ఆరంభమవుతుంది. అయితే యానిమేటెడ్ సీక్వెన్స్ కు బదులుగా మనం పుష్ప రాజ్ (అల్లు అర్జున్) స్మగ్లర్లతో పోరాడటం చూస్తాం. మనం ఈ సీక్వెన్స్ ను తర్వాత అందుకుంటాం. ఇక ఇంటి విషయానికి వస్తే అతడు పెళ్లి చేసుకుని ఆనందంగా గడుపుతుంటాడు. కానీ ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోడానికి సంసిద్ధుడై ఉంటాడు. భన్వర్ సింగ్ షేకావత్(ఫహద్ ఫాస్సిల్),మంత్రి సిద్ధప్ప(రావు రమేశ్) అన్ని అడ్డంకులు తొలగించి అతడు తిరిగి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడానికి సాయపడతారు.
కేంద్ర మంత్రి ప్రతాప్ రెడ్డి(జగపతి బాబు) రంగంలోకి ప్రవేశిస్తాడు. అయితే అతడు పుష్ఫ విధానాలకు తలొగ్గడు. పుష్పకు ఇక ఒక శత్రువు కాక అనేక మంది శత్రువుల తయారవుతారు. దాంతో అతడు చందనం స్మగ్లింగ్ ప్రపంచంలో తన చాకచక్యాన్ని ప్రదర్శిస్తాడు. తాను కోరుకున్నట్లు పుష్ప రాజ్ అంతర్జాతీయంగా పేరుమోస్తాడా? భన్వర్ సింగ్ షెకావత్, ప్రతాప్ రెడ్డిలను అతడు ఎలా హ్యాండిల్ చేస్తాడు? వీటన్నిటికి సమాధానం 3 గంటల 20 నిమిషాల సినిమాలో దొరుకుతుంది.
ఎవరు ఎదురొచ్చినా తగ్గేదేలే అంటూ ఢీ కొట్టే పుష్పరాజ్ తన పేరునే ఓ బ్రాండుగా మార్చేసుకుంటాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు విస్తరించడంలో దృష్టిపెడతాడు. బయటి లోకానికి పుష్పరాజ్ ఓ ఫైర్ బ్రాండ్.. కానీ ఇంట్లో మాత్రం పెళ్లాం శ్రీవల్లి(రష్మిక మందన్న) మాట జవదాటడు. తన భర్త ముఖ్యమంత్రితో ఫోటో తీసుకుంటే చూడాలన్నది శ్రీవల్లి కోరిక. పెళ్లాం చెప్పింది కదాని ఎంఎల్ఏ సిద్ధప్ప నాయుడు(రావు రమేశ్)తో కలిసి సిఎం దగ్గరికి పోతాడు. అక్కడికి వెళ్లాక ఏమి జరిగిందన్నది తెరపైనే చూడాలి. ఈ సినిమా చూస్తే మంచి మాస్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకు అంతర్జాతీయ టచ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇంటర్వెల్ కు ముందు భాగం ఒక ఎత్తైతే, ఇంటర్వెల్ తర్వాతి భాగం మరో ఎత్తుగా ఉంటుంది. సినిమా ఆరంభం నుంచి అందరూ చూడకుండా సినిమా టికెట్ల రేట్లు పెంచేయడం ఆక్షేపణీయమనే చెప్పాలి. సినిమాలోని పాటలు కూడా హుషారెక్కిస్తాయి. ఈ సినిమాలో కెమెరా పనితనం ప్రత్యేక ఆకర్షణ.
ఈ సినిమా చూడొచ్చా? అంటే… చూడొచ్చు. కానీ హై ఎక్స్ పెక్టేషన్స్ తో చూడకండి! ఇదో మాస్ మూవీ.
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్ తదితరులు.
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్ కూబా బ్రోజెక్.
నిర్మాత: నవీన్ యెర్నేని
పాటలు: చంద్రబోస్
రచన, దర్శకత్వం: సుకుమార్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్.
రిలీజ్ డేట్: 05-12-2024
రేటింగ్: 3/5
రివ్యూ: అశోక్.