Tuesday, December 17, 2024

క్లైమాక్స్ షూటింగ్‌లో అల్లు అర్జున్ …

- Advertisement -
- Advertisement -

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప- 2 ది రూల్. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. దేవిశ్రీప్రసాద్ అత్యద్భుతమైన సంగీతానికి, చంద్రబోస్ సాహిత్యానికి.. ఆ పాటల్లో హీరో స్టెప్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతోంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్భుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. ఇక పుష్ప మొదటి భాగం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News