Thursday, January 16, 2025

పుట్టినరోజు కానుకగా టీజర్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్‌పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సోమవారం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 11:07 నిమిషాలకు ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రకటన పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్.

ఈ స్టిల్లో అల్లు అర్జున్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. ఈ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం పుట్టినరోజు జరుపుకోనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఈ సంవత్సరం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఐకాన్ స్టార్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. మెట్ట మెదటిసారిగా దక్షిణ భారతదేశ నటుడి విగ్రహాన్ని దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం తెలుగు వారందరికి గర్వకారణం. ఇక త్వరలో పుష్ఫ 2తో మరోక్కసారి ప్రపంచంలోని సినిమా అభిమానులంతా ఒక్కసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపాన్ని చూడబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News