Thursday, January 16, 2025

పుష్ప- 2 ది రూల్ ఫస్ట్‌హాఫ్ అద్భుతం…

- Advertisement -
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప- 2 ది రూల్. పుష్ప ది రైజ్ సా ధించిన బ్లాక్‌బస్టర్ విజయమే అందుకు కారణం. ఈ చిత్రంలోని ప్రతి అంశం సినీ ప్రేమికులను అ మితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పుష్ప-2 గురించి ప్రతి అంశం సెన్సేషనే. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ద ర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇం డియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.

డి సెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సం బంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం ఫస్ట్‌హాఫ్ లాక్ చేశారు. ఈ ఫస్ట్‌హాఫ్ అద్భుతంగా వుందని, ప్రేక్షకులు ఎంత ఊ హించుకున్నా అంతకు తగ్గేదేలే లా వుందని అం టున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాలెన్స్ షూటింగ్‌ను జరుపుకుంటునే మ రోవైపు నిర్మాణానంతర పనులను శరవేగంగా జ రుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చి న టీజర్, రెండు పాటలు ఎంతటి సంచలనం సృ ష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇం డియా స్థాయిలో డిసెంబరు 6న పుష్ప- 2 క్రియేట్ చేయబోయే రికార్డుల గురించి అందరు రెడీ కావాల్సిందేనని అంటున్నారు మేకర్స్. అంతేకాదు ఈ చిత్రం రిలీజ్‌కు ముందే 1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తిచేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News