Monday, December 23, 2024

‘పుష్ప 2 ది రూల్’ టీజర్‌తో పూనకాలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సోమవారం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ అందరికీ పూనకాలు తెప్పిస్తోంది. ఈ టీజర్‌లో అల్లు అర్జున్ గంగమ్మ జాతర గెటప్‌లో వీర మాస్ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకు ముందు టాలీవుడ్‌లో ఏ హీరో కనిపించని విధంగా ఊర మాస్ అవతార్‌లో కనిపించి సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేశారు. ఇందులో అల్లు అర్జున్ చీరకట్టి కాలు వెనక్కి మడిచి పైట కొంగుని అందుకున్న తీరు చూస్తుంటే సినిమా అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఉండబోతుందనే హింట్‌ని ఇచ్చేస్తోంది. ఇందులో అల్లు అర్జున్ లుక్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్… ప్రపంచ సినీ ప్రేక్షకులంతా మరోసారి పుష్పరాజ్ గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ విశ్వరూపం చూడబోతున్నారనేది ఈ టీజర్‌తో మరోసారి సుస్పష్టమైంది. ఇక ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News