Tuesday, January 7, 2025

బర్త్ డేకి అదిరిపోయే సర్‌ప్రైజ్

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న పుష్ప 2 సినిమా నుండి ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్‌ని టీమ్ ప్లాన్ చేస్తోందని తెలిసింది.

దీనికి సంబంధించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందట. ఫహాద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ ఆగష్టు 15న గ్రాండ్‌గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News