Tuesday, January 14, 2025

పుష్ప 2 విలన్ లవ్ స్టోరీ

- Advertisement -
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో విలన్‌గా నటించి పాన్ ఇండియా స్టార్‌డమ్ దక్కించుకున్నాడు మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్. అయితే ఫహద్ ఒక లవ్ స్టోరీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడని తెలిసింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ సినిమాను ఫహద్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు కనిపించని విభిన్నమైన పాత్రలో అతను కనిపించబోతున్నాడని సమాచారం. ఇంతియాజ్ ఈ సినిమా కోసం హీరోయిన్‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రిని ఎంపిక చేయడం జరిగిందని తెలిసింది.

యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్‌తో నటించిన త్రిప్తి డిమ్రికి మంచి గుర్తింపు దక్కింది. యానిమల్‌లో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నతో పోల్చితే త్రిప్తికి ఎక్కువ పాపులారిటీ దక్కింది అంటే ఆమె ఏ స్థాయిలో అందాల ఆరబోత చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంతియాజ్ చెప్పిన కథ నచ్చడంతో పాటు పాత్ర నచ్చడంతో ఈ అమ్మడు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.ఈ సినిమాలో విభిన్నమైన ప్రేమ కథను చూపిస్తారట. హిందీలో రూపొందబోతున్న ఈ సినిమాను సౌత్‌లో అన్ని భాషల్లోనూ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News