Sunday, December 22, 2024

అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

Pushpa As Film of the Year

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కేవలం తెలుగులోనే కాకు ండా పాన్ ఇండియా వైడ్‌గా అన్ని భాషల్లోనూ అద్భుతం చేసింది పుష్ప. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బన్నీ మేనరిజమ్స్ ఫాలో అవుతున్నారు. ఈ సినిమాలో బన్నీ నటనకు ఇప్పటికే ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా మరో అరుదైన గౌరవం పుష్ప సినిమాకు దక్కింది. ఈ చిత్రం దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 అవార్డ్స్‌లో ఫిలిం ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది. ఈ అవార్డ్ రావడంపై చిత్ర యూనిట్ సంతో షం వ్యక్తం చేసింది. ఎర్ర చంద నం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సం యుక్తంగా నిర్మించాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ మొదలు కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News