Thursday, January 9, 2025

పుష్ప అనేది సుకుమార్ సినిమా: అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా గురువారం భారీ అంచనాలతో పుష్ప2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత అం దిస్తున్న చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై న వీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా సునీల్, ఫహాడ్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జె ట్ తో ఈ చిత్రం రానుంది. హైదరాబాద్‌లో పుష్ప వైల్డ్ ఫైర్ జాతరను భారీగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి మాట్లాడుతూ “పుష్ప 1 సమయంలో బన్నీతో ‘నార్త్ ఇండియాని వదలకు… అ క్కడ నీకోసం ఎంతోమంది అభిమానులు ఉన్నారు’ అ ని చెప్పాను.

ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రమోషన్స్ అవసరం లేనంతగా క్రేజ్ ఉంది. రెండు, మూడు నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప షూటింగ్ జరుగుతుండగా అక్కడికి వెళ్లాను. అక్కడ సుకుమార్ నాకు సినిమాలో ఒక సీన్ చూపించడం జరిగింది. ఆ సీన్ పుష్ప రాజ్ ఇంట్రడక్షన్ సీన్. అది చూస్తేనే నాకు అర్థం అయిపోయింది… సినిమా ఎలా ఉండబోతుంది అనేది”అని అన్నారు. చిత్ర నిర్మాత మైత్రి నవీన్ మా ట్లాడుతూ “డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం నుండి సి నిమా థియేటర్లో రాబోతుంది. అందరూ ఈ సినిమాని ఆదరించి పెద్ద హిట్టు చేస్తారని కోరుకుంటున్నాను”అ ని తెలియజేశారు. చిత్ర దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ “నేను బన్నీని ఆర్య నుండి చూస్తున్నాను. తను ఎలా ఎదుగుతున్నాడు చూస్తూనే వచ్చాను.

తనని వ్య క్తిగా, ఒక ఆర్టిస్టుగా చూశాను. ఈ పుష్ప అనే సినిమా ఇలా వచ్చింది అంటే దానికి కేవలం నాకు, బన్నీకి ఉ న్న ఒక బంధం కారణంగానే. బన్నీ ఒక సీన్ కోసమో లేదా ఒక సాంగ్ కోసమో కాదు, హావభావాల కోసం కూడా ఎంతో కష్టపడతాడు. అది ఎంత చిన్నదైనా సరే చాలా శ్రద్ధతో చేస్తాడు. కేవలం బన్నీ మీద ప్రేమతోనే ఈ సినిమా నేను తీశాను. సినిమాలో రష్మిక అద్భుతం గా నటించింది. శ్రీలీల డాన్స్ చాలా బాగా చేసింది”అ ని పేర్కొన్నారు. ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ మాట్లాడు తూ “పుష్ప1 పూర్తయ్యేప్పటికీ పుష్ప2 కథను వినలే దు. కానీ పూర్తిగా నమ్మకం ఉంది పుష్ప2 అస్సలు తగ్గేదేలే అని. మా నిర్మాతలు మైత్రి నవీన్, రవిలకు ధ న్యవాదములు. వీళ్ళు కాకుండా ఇంకా ఏ నిర్మాతలు అయినా ఈ సినిమా తీయగలిగే వారు కాదు. ఈ సినిమాలో ఫహద్ ఫజల్ ఎంతో అద్భుతంగా నటించారు.

ఈ సినిమాలో నటించిన రావు రమేష్, సునీల్, అనసూయ తదితరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలా గే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీలకు థాం క్స్. రష్మిక ఎంతో ప్రొఫెషనల్‌గా ఈ సినిమా కోసం ప నిచేసింది. ఇక పుష్ప అనేది సుకుమార్ సినిమా. ఈ యనను చూసి ఇంత గొప్ప డైరెక్టర్ తెలుగులో ఉన్నాడా అనుకునేలా పనిచేస్తారు. సుకుమార్ నాతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను లేను. ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 వేలకు పైగా స్క్రీన్ లలో 80 పైగా దేశాలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఆరు భాషలలో ఓ పండగ వాతావరణం ఉండబోతుంది. దీనికి ఎంతో గర్విస్తున్నాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అల్లు అర్హ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, నటి శ్రీలీల, చిత్ర నిర్మాత మైత్రి రవి, చెర్రీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ , మలినేని గోపీచంద్, బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, అనసూయ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News