Monday, March 10, 2025

పుష్పకి వచ్చిన డబ్బులు వారికి ఇవ్వాలి: హైకోర్టులో పిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి తాజాగా తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. పుష్ప-2కి వచ్చిన లాభాలను చిన్న సినిమాల బడ్జెట్ రాయితీకి, జానపద కళాకారుల ఫించన్ కోసం కేటాయించాలని న్యాయవాది నరసింహారావు పిల్ ధాఖలు చేశారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వల్లే ఈ సినిమాకి అంత లాభాలు వచ్చాయని ఆయన అన్నారు. రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ఉత్తర్వులిచ్చి మరీ టికెట్ ధరలు పెంచుకొనేందుకు సహకరించిందని పేర్కొన్నారు. అందుకు గత కారణాలు చెప్పాలేదని ఆయన న్యాయస్థానానికి వివరించారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వచ్చిన లాభాలను కళాకారుల సంక్షేమానికి ఉపయోగించాలని కోరారు. అయితే ‘బెనిఫిట్ షోలు, టికెట్ల వసూలు కథ ముగిసింది కదా’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే వాటి వల్ల వచ్చిన లాభం గురించే ఈ పిల్ దాఖలు చేశామని లాయర్ వివరించగా.. సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలన్న కోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News