Wednesday, January 22, 2025

18న శ్రీ కల్యాణ వేంకటేశ్వరునికి పుష్పయాగం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 18న పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుని ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారని, అందులో పాలు, పెరుగు, తేనే, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4 వరకు తులసి, చామంతి, గన్నెరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజ, కలువలు లాంటి పుష్పజాతులతో పుష్పయాగం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్రతువును పురస్కరించుకొని 18న నిత్య కల్యాణోత్సవ సేవను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News