Friday, December 20, 2024

సెల్పీ విత్ తెలంగాణ ద్రోహులు అని పెట్టుకోండి : దూదిమెట్ల బాలరాజు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సెల్ఫీ విత్ కాంగ్రెస్ కాదు..సెల్ఫీ విత్ తెలంగాణ ద్రోహులు అని పెట్టుకోవాలని బిఆర్‌ఎస్ నాయకుడు, తెలంగాణ షీప్స్ అండ్ గోట్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ విమర్శించారు. 2007లో ముదిగొండ కాల్పులు జరిపి ఏడుగురు రైతులను కాల్చి చంపిన మాజీ సిఎం వైఎస్‌ఆర్ పోటోతో సెల్పీ విత్ కాంగ్రెస్ అంటే 100 ఎలుకలను తిన్న పిల్లి సంతాప సభ పెట్టినట్టుగా ఉందని విమర్శించారు. తెలంగాణకు చేసిన అన్యాయాలను కాంగ్రెస్ గుర్తుచేస్తుందా..?, ఆర్‌డిఎస్ తూములను పగలకొట్టిన చరిత్రను గుర్తు చేస్తుందా..? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయటం కోసం టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను కొన్న చరిత్రను మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌ను తీసివేస్తామన్న పిసిసి అధ్యక్షుడి మాటలు.. రైతుల మనోబావాలను దెబ్బతీయగా..వాటిని కప్పిపుచ్చుకోవటం కోసం కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెరలేపిందని ఆరోపించారు. సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కి చర్యతో కాంగ్రెస్‌లో బానిస రాజకీయతత్వం బయటపడిందని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News