Thursday, November 14, 2024

కావాలంటే నన్ను జైల్లో పెట్టుకోండి

- Advertisement -
- Advertisement -

Put me in jail if you want: Uddhav Thackeray

నా కుటుంబ సభ్యులను వేధించడం ఎందుకు?
అసెంబ్లీలో బిజెపిపై ఉద్ధవ్ థాకరే నిప్పులు

ముంబయి: తమ పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులో తన బావమరిది ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఇడి) స్తంభింపజేయడం తనను లక్షంగా చేసుకోవడమేనని అన్నారు. తనను జైలుకు పంపాలనుకుంటే పంపండి కానీ..తన కుటుంబ సభ్యులను వేధించడం ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన థాకరే కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ‘ అధికారంలోకి రావాలనుకుంటే రండి. అంతేకాని అధికారంలోకి వచ్చేందుకు ఇటువంటి దుర్మార్గపు పనులు చేయకండి. మా కుటుంబంతో పాటు ఇతర కుటుంబ సభ్యులను వేధించకండి. మీ కుటుంబ సభ్యులపై మేమెప్పుడూ అలా వ్యవహరించలేదు. మీరు అధికారంలోకి వచ్చేందుకు మమ్మల్ని జైల్లో పెట్టాలనుకుంటే ముందు నన్ను జైల్లో పెట్టండి’ అంటూ మహారాష్ట్ర అసెంబ్లీలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర భాగస్వామ్య పక్షాల నేతలు, వారి సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడాన్ని తప్పుబట్టారు. గత కొంత కాలంగా మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News