కరీంనగర్: స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 పోటీలలో కరీంనగర్ జిల్లాను జాతీయ స్థాయిలో ముందుండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ఎంపీడీవోలకు పిలుపునిచ్చారు.
బుధవారం స్వచ్ఛ సర్వేక్షన్‌పై రాష్ట్ర స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవోతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేష్, ఇఫ్సాస్ సంస్థ ప్రతినిధి వివేక్ సర్వేక్షన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరిశీలన వివరాలను వివరించడం జరిగింది.అనంతరం జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు ఉద్దేశించి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా ఇప్పటికే దేశంలోనే 5 స్టార్ రేటింగ్‌తో ముందు వరుసలో ఉందని తెలియజేశారు.
సంపూర్ణ పారిశుద్ధం – సమగ్ర ఆరోగ్యానికి నాంది అని తెలియజేస్తూ జూలై 15 నుండి ఆగస్టు 15 జరిగే స్వచ్ఛత – పరిశీలన (స్వచ్ఛ సర్వేక్షన్) సమయాత్తం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్డీఎ శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, డీఎల్‌పీఓ కిషన్, లత, యూనిసెఫ్ సమన్వయకర్త కిషన్‌స్వామి, ఎస్‌బీఎం రమేష్, వేణు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.