Monday, December 23, 2024

రష్యా సైన్యం పుతిన్‌ను తప్పుదోవ పట్టించిందా..?

- Advertisement -
- Advertisement -

Putin being misled by Advisers says US

రష్యా సైన్యం పుతిన్‌ను తప్పుదోవ పట్టించిందా?
సలహాదారులు వాస్తవాలు చెప్పడానికి భయపడుతున్నారు
ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: ఉక్రెయిన్ వార్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వాస్తవాలు వెల్లడించడానికి సైనికాధికారులు, సలహాదారులు భయపడుతున్నారని అమెరికా వెల్లడించింది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య పెద్ద వ్యూహాత్మక తప్పిదమని, దీని ఫలితంగా రష్యా బలహీనం కావడమే కాకుండా ప్రపంచ వేదికపై అది దాదాపు ఒంటరి అయిపోతోందని వైట్‌హౌస్ పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న క్రమంలో పుతిన్‌కు ఆయన సిబ్బందితో సంబంధాలు దిగజారాయని వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్‌ఫీల్డ్ బుధవారం ఇక్కడ మీడియా సమావేశంలో చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం ఎంత పేలవంగా పని చేస్తున్నదో.. ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ ఛిద్రమవుతున్న తీరుపై పుతిన్‌కు ఆయన సలహాదారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తాము భావిస్తున్నామని ఆమె చెప్పారు. పుతిన్‌కు వాస్తవాలు చెప్పడానికి సీనియర్ సలహాదారులు సైతం భయపడుతున్నారని అన్నారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగుతో పుతిన్ సంబంధాలు దెబ్బతిన్నాయని, రెండువారాలుగా ఆయన ఎక్కడా కనిపించడం లేదని వైట్‌హౌస్ పేర్కొంది. రక్షణ మంత్రిత్వ శాఖ నాయకత్వాన్ని పుతిన్ విశ్వసించడం లేదని, పుతిన్‌కు, రక్షణ శాఖకు మధ్య టెన్షన్ నెలకొందని పేర్కొంది. ‘అందువల్ల ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య వ్యూహాత్మకంగా పెద్ద తప్పిదమని, దాని ఫలితంగా రాబోయే కాలంలో రష్యా బలహీనం కావడమే కాకుండా ప్రపంచ వేదికపై ఏకాకి అవుతోందని స్పష్టమవుతోంది’ అని కేట్ బెడింగ్‌ఫీల్డ్ అన్నారు. రష్యన్ బలగాల దాడిని క్షేత్రస్థాలో ఉక్రెయిన్ దీటుగా తిప్పికొడుతున్న క్రమంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆదేశాలను పాటించని రష్యా సైనికులు: బ్రిటన్
మరో వైపు ఉక్రెయిన్‌లోని రష్యా సైనికులు తమ పై అధికారుల ఆదేశాలను పాటించడానికి నిరాకరిస్తున్నారని, తమ సొంత ఆయుధ సామగ్రినే ధ్వంసం చేస్తున్నారని, తమ సొంత యుద్ధ విమానాన్నే కూల్చి వేశారని బ్రిటన్ ఇంటెలిజన్స్ చీఫ్ జెరెమీ ఫ్లెమింగ్ చెప్నారు. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఫ్లెమింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పుతిన్‌ను అమెరికా అర్థం చేసుకోలేదు: క్రెమ్లిన్
ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై సైనిక దాడుల విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆయన సలహాదారులు తప్పుదోవ పట్టిస్తునారన్న వైట్‌హౌస్ ఆరోపణలపై క్రెమ్లిన్ స్పందించింది. క్రెమ్లిన్‌లో ఏం జరుగుతోందో వారికి అర్థం కావడం లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ గురువారం అన్నారు. అసలేం జరుగుతోందనే దానిపై అమెరికా విదేశాంగ శాఖకు, పెంటగాన్‌కు సరైన సమాచారం లేదన్నారు. మా పని తీరూ వారికి అర్థం కాదన్నారు. ఇటువంటి అపార్థాలు తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తాయన్నారు.

Putin being misled by Advisers says US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News