ఉక్రెయిన్ సైన్యానికి పుతిన్ సలహా
చర్చలకు సిద్ధమంటూ మరో ప్రకటన
మాస్కో: ప్రస్తుత ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉక్రెయి న్‌లోఅధికారంలో ఉన్న వారిని ఉగ్రవా దులు, డ్రగ్ అడిక్ట్‌లు, నయా నాజీల కూటమితో పోల్చిన ఆయన వారిని అధికారంలోంచి దించేయాలని పిలుపునిచ్చారు.‘ మీ చేతు ల్లోకి అధికారాన్ని తీసుకోం డి. అలా చేస్తే ఈ డ్రగ్ అడిక్ట్‌లు, నియో నాజీల గ్యాంగ్‌కన్నా మీతో అంగీకారానికి రావడం మాకు సులువు అవుతుంది’ అని శుక్రవారం ఓ టీవీ చానల్ ద్వారా మాట్లాడుతూ పుతిన్ అన్నారు. ‘ఉక్రెయిన్‌లోని మిలిటరీకి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా..అభినవ నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, పెద్దలు, భార్యలను ఉండనీయొద్దు. అధికారాన్ని మీరు హస్తగతం చేసుకోండి’ అంటూ ఉక్రెయిన్ సైనికులకు పుతిన్ సూచించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యూదుడు కావడం గమనార్హం. ఉక్రెయిన్ బలగాలు ఆయుధాలు వీడితే తాము చర్చలకు సిద్ధమేనని ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో సంభాషించిన తర్వాత రష్యా అధ్యక్ష కార్యాలయం ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం. యుద్ధాన్ని ఆపాలని జిన్‌పింగ్ కూడా పుతిన్‌కు సూచించారు. మరోవైపు యుద్ధాన్ని ఆపాలని, చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా రష్యాను కోరారు. ఉక్రెయిన్‌కు తటస్థ స్థాయిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరరాదని, తటస్థ వైఖరి అవలంబించాలని రష్యా మొదటినుంచీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమని ప్రకటించారు.