Wednesday, December 25, 2024

ట్రంప్‌పై కేసులు రాజకీయ ప్రేరేపితం.. మద్దతుగా పుతిన్ వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

మాస్కో : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతు పలికారు. ఆయనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు. రష్యా, ట్రంప్ మధ్య స్నేహపూరిత వాతావరణం కనిపిస్తుంటుంది.ఈ క్రమం లోనే తాజా వ్యాఖ్యలు వినిపించాయి. మరోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని చూస్తున్న ట్రంప్ , కేసుల సుడిగుండంలో చిక్కుకు పోతున్నారు. 2020 ఎన్నికల సందర్భంగా ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్టు ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి.

అలాగే శృంగార తారకు డబ్బుల చెల్లింపు కేసు, శ్వేతసౌధం రహస్యపత్రాలను తరలించిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ట్రంప్‌నకు మద్దతుగా పుతిన్ స్పందిస్తూ ‘అమెరికాలో మాజీ అధ్యక్షుడిని వేధిస్తున్న తీరు… ఆ దేశ వ్యవస్థల పతనానికి నిదర్శనం. తన పోటీదారుపై రాజకీయ ప్రేరేపితమైన వేధింపులు జరుగుతున్నాయి.’ అంటూ బైడెన్ ప్రభుత్వంపై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు అంశాల్లో అమెరికా,రష్యా మధ్య సత్సంబంధాలు లేవు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన దగ్గరి నుంచి అవి మరింత దిగజారాయి. అమెరికాకు వచ్చే ఏడాది ఎవరు అధ్యక్షుడైనా రష్యా పట్ల ఆ దేశ విదేశాంగ విధానంలో మార్పు ఉంటుందనుకోవడం లేదని పుతిన్ అన్నారు. సామాన్య అమెరికన్ల మనసుల్లో రష్యా వ్యతిరేక భావజాలాన్ని వాషింగ్టన్ రెచ్చగొడుతోందని నిందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News