Saturday, January 18, 2025

ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభంపై పుతిన్ వైఖరి ఇదే…

- Advertisement -
- Advertisement -

మాస్కో: హమాస్ దాడుల దరిమిలా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తలెత్తిన అనిశ్చితతపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన వైఖరిని స్పష్టం చేశారు.  మధ్య ప్రాచ్యంలో ప్రస్తుత సంక్షోభానికి అమెరికాదే పూర్తి బాధ్యతని పుతిన్ నిందించారు. అమెరికాకు చెందిన మధ్యప్రాచ్య విధానాల పైపల్యాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలని ఆయన పేర్కొన్నారు. శాంతి ఒప్పందంపై పూర్తి గుత్తాధిపత్యం తీసుకోవడానికి ప్రయత్నించిన అమెరికా రెండు పక్షాలకు ఆమోదయోగ్యమైన రాజీమార్గాలను అన్వేషించడంపై దృష్టి పెట్టలేదని పుతిన్ ఆరోపించారు.

ఇజ్రాయోల్, పాలస్తీనాపై అమెరికా ఒత్తిడులు తీసుకురావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలలో ప్రస్తావించినట్లు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా సృష్టించడంతోసహా పాలస్తీనా ప్రజల ప్రయోగజనాలను పరిశీలించం వంటి కీలక అంశాన్ని వదిలిపెట్టి ఏకపక్ష నిర్ణయాలను రుద్దే ప్రయత్నానికి అమెరికా పాల్పడుతోందని పుతిన్ ఆరోపించారు.

ఇదిలా ఉండగా..సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా పాలస్తీనా ప్రజలకు తన మద్దతును ప్రకటించారు.
కాగా..ఆయుధాలతో కూడిన అమెరికాకు చెందిన మొదటి విమానం ఇజ్రాయెల్‌ను చేరుకుంది. హమాస్‌పై యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యానికి ఉపయోగపడే ఆయుధాలతో అమెరికా పంపించింది. దక్షిన నెగెవ్ ఎడారిలోని నెవటిమ్ ఎయిర్‌బేస్‌లో అత్యంత అధునాతన ఆయుధాలతో కూడిన అమెరికా విమానం దిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి నానియల్ హగరి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News