Wednesday, January 22, 2025

ద్రౌపదీ ముర్ముకు పుతిన్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

Putin congratulates Droupadi Murmu

మాస్కో : భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నేతృత్వంలో ఇరు దేశాల మధ్య సహకారం మరింత దృఢమవ్వాలని ఆకాంక్షించారు. ఈమేరకు రష్యా అధ్యక్ష భవనం క్రెమిన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. “భారత్‌తో విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలకు మేం చాలా ప్రాధాన్యమిస్తాం. దేశాధినేతగా మీ (ద్రౌపదీ ముర్ము) నాయకత్వంలో రెండు దేశాల మధ్య రాజకీయ , ఉత్పాదక సహకారం మరింత వృద్ధి చెందుతుందని మేం విశ్వసిస్తున్నాం. పలు రంగాల్లో మన స్నేహపూర్వక దేశాల పరస్పర ప్రయోజనాలు, అంతర్జాతీయ స్థిరత్వం, భద్రత కోసం మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం. ”అని పుతిన్ ఆ సందేశంలో పేర్కొన్నారు. వచ్చేనెల 8 లోగా మెజారిటీ నిరూపించుకోండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News