- Advertisement -
ఉక్రేయిన్ తో యుద్ధంలో మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటించేందుకు రష్యా ప్రెసిడెంట్ వ్లాదమిర్ పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మే 8 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 10 వరకూ కాల్పుల విరమణ ప్రకటించారు పుతిన్. రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్ యూనియన్,మిత్రదేశాల విజయం 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది. ఉక్రేయిన్ కూడా కాల్పుల విరమణ పాటించాలని పుతిన్ పేర్కొన్నారు. రష్యా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించినా.. ఉక్రేయిన్ నుంచి ఉల్లంఘనలు జరిగితే.. రష్యా సాయుధ దళాలు అత్యంత తీవ్రంగా జవాబు ఇస్తాయని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
- Advertisement -