మాస్కో: ఉక్రెయిన్ నుంచి అక్రమంగా విలీనం చేసుకున్న నాలుగు రీజియన్లలో సైనిక పాలన విధిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఆ రీజియన్లకు అదనంగా అత్యవసర అధికారాలను అప్పగించారు. ఈ విషయాన్ని బుధవారం పుతిన్ తక్షణం ప్రకటించక పోయినా చట్టపరంగా చర్యలు అమలు లోకి తెచ్చినట్టు స్పష్టమౌతోంది. ప్రయాణాలపైన ఆంక్షలుతోపాటు ప్రజల సమావేశాలపై కూడా ఆంక్షలు అమలు చేశారు. సెన్సార్‌షిప్‌ను కట్టుదిట్టం చేశారు. చట్టపరంగా అధికారాలను విస్తృతం చేశారు. అయితే రష్యా రీజియన్ల అధిపతులకు ఎలాంటి అదనపు అధికారాలు ఇచ్చారో స్పష్టం చేయలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి సంబంధించి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం పెంపొందించడానికి వీలుగా కోఆర్డినేషన్ కమిటీని నెలకొల్పాలని పుతిన్ ఆదేశించారు. దీన్ని స్పెషల్ మిలిటరీ ఆపరేషన్‌గా పుతిన్ పేర్కొంటున్నారు.
Putin imposes martial law in 4 Occupied Ukraine Areas