Tuesday, December 24, 2024

నావల్నీ హత్యకు పుతిన్ ఆదేశించక పోవచ్చు: అమెరికా

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: బందీగా ఉండగా రష్యా విపక్షనేత అలెక్సీ నావల్నీ మరణం వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేయలేదని అమెరికా నిఘా వర్గాలు నిర్ణయించాయి. చాలా కాలంగా జైల్లో ఉన్న నావల్నీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించారు. అయితే అంతిమంగా నావల్నీ మరణానికి పుతిన్ కారణమయ్యారని అమెరికా అధికారులు నమ్ముతున్నారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ తిరిగి ఎన్నికవ్వడానికి సరిగ్గా ముందు ఈ సంఘటన జరిగింది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందిస్తూ నావల్నీ మరణానికి పుతిన్ బాధ్యుడని ఆరోపించారు.

అయితే నేరుగా పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండక పోవచ్చని బైడెన్ అభిప్రాయపడ్డారు. నావల్నీకి ఏం జరిగిందో ఖచ్చితంగా అమెరికాకు తెలియదని, అయితే పుతిన్, అతని దుండగులు ఏదో చేసినదానికి పర్యవసానమే నావల్నీ మరణమని ఏమాత్రం సందేహం లేదని బైడెన్ ఆరోపించారు. రష్యా అధికారులు మాత్రం నావల్నీ మరణం పూర్తిగా సహజమైన కారణాలతోనే జరిగిందని చెబుతున్నారు. అతడిపై విషప్రయోగం, హత్యకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. 47 ఏళ్ల నావల్నీ రష్యాలో ప్రఖ్యాత విపక్ష నేత.

పుతిన్‌కు అత్యంత నిరంతర శత్రువు. రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీ నేతగా అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టారు. గత అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యం లోనే 2020లో సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు అతడిపై విష ప్రయోగం జరిగింది. జర్మనీ లోని కొన్ని నెలల పాటు చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. 2021 జనవరిలో తిరిగి రష్యాకు వచ్చారు. రాగానే రష్యా పోలీస్‌లు ఎయిర్‌పోర్ట్ లోనే అరెస్టు చేశారు. నిధుల దుర్వినియోగం, సహా అనేక అభియోగాలపై 19 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆర్కిటిక్ సర్కిల్ పైన మారుమూల శిక్షా కాలనీలో 19 ఏళ్ల శిక్ష అనుభవిస్తుండగా, ఈ ఏడాది ఫిబ్రవరి 16న చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News