Monday, December 23, 2024

జి20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్న పుతిన్

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బాలిలో 15,16 తేదీల్లో జరుగనున్న జి20 శిఖరాగ్ర సమావేశాల్లో వీడియో లింక్ ద్వారా పాల్గొననున్నారు. ఇండోనేషియాలోని రష్యా రాయబార కార్యాలయాన్ని ఉటంకిస్తూ వార్తా సంస్థ ఆర్‌ఐఏ గురువారం ఈ విషయాన్ని తెలిపింది. పుతిన్‌ను ఆహ్వానించొద్దని పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్ తెచ్చిన ఒత్తిడిని ఇండోనేషియా బేఖాతరు చేసింది. అలా చేయలేనని స్పష్టంచేసింది. మొత్తానికి జి20 సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుతిన్ పాల్గొంటారన్నది స్పష్టం అయింది.

రష్యా విదేశాంగ మంత్రి జి20 సమావేశంలో పాల్గొంటారని, తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఒక సమావేశంలో ఆన్‌లైన్ ద్వారా చేరుతారని ఇండోనేషియా ప్రభుత్వం ‘రాయిటర్స్’ వార్తా సంస్థకు తెలిపింది. ఇండోనేషియా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్సీని కూడా ఆహ్వానించింది. అయితే పుతిన్ సమావేశంలో పాల్గొంటే తాను పాల్గొనబోనని జెలెన్సీ స్పష్టంచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News