Thursday, January 23, 2025

మోడీ-పుతిన్ భేటీ ఖాయమే.. అధికారిక ప్రకటన చేసిన క్రెమ్లిన్

- Advertisement -
- Advertisement -

Putin Modi to meet on SCO margins

మాస్కో : ఉజ్బెకిస్థాన్ వేదికగా గురువారం నుంచి జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ( ఎస్‌సివో ) సదస్సులో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. “ 22 వ ఎస్‌సీవో సదస్సుకు మోడీ, పుతిన్ హాజరు కానున్నారు. సదస్సులో భాగంగా ఈ దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, ఐక్యరాజ్యసమితి , జీ 20లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలు వీరి అజెండాలో ఉండే అవకాశం ఉంది. డిసెంబరులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి, 2023లో జీ20, ఎస్‌సీవోకు భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక భేటీకి ప్రాముఖ్యత ఏర్పడనుంది” అని క్రెమ్లిన్ అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే మోడీ, పుతిన్ భేటీపై భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఉజ్బెకిస్థాన్ లోని సమర్‌ఖండ్‌లో ఈ సదస్సు జరుగుతుంది. భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వంటి కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News