- Advertisement -
మాస్కో: ప్రయోగ పరీక్షల్లో భాగంగా ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ స్ఫుత్నిక్ విని తాను వేసుకున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఈ టీకా వేసుకున్న తరువాత తనకు ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని ఓ అధికారిక సమావేశం సందర్భంగా చెప్పారు. కాగా ఈ నాసికా టీకా ప్రయోగ పరీక్షల (క్లినికల్ ట్రయల్స్) కు సంబంధించి 500 మంది వాలంటీర్లకు వేసేందుకు గాను గత నెలలో రష్యా వైద్య ఆరోగ్యశాఖ అనుమతించింది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభమైన విషయంపై మాత్రం స్పష్టత లేదు. గతంలో రష్యా స్వదేశీ టీకా స్ఫుత్నిక్ వీ ని కూడా పుతిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే తాను స్ఫుత్నిక్ లైట్ బూస్టర్ డోసు కూడా వేసుకున్నట్టు గత ఆదివారమే పుతిన్ తెలిపారు.
Putin takes Nashik Vaccine in Experimental Test
- Advertisement -