Tuesday, December 24, 2024

మళ్లీ పుతిన్‌కే పగ్గాలు

- Advertisement -
- Advertisement -

రష్యా అధ్యక్ష పదవికి మరోసారి పుతిన్ ఎన్నిక
స్టాలిన్ రికార్డు తిరగరాయనున్న నేత
87 శాతం ఓట్లు ఆయనకే..

మాస్కో : రష్యాలో ఐదో దఫా కూడా అధ్యక్ష పీఠం అత్యం త సులువుగా ఇప్పటి అధినేత వ్లాదిమిర్ పుతిన్ దక్కించుకున్నారు. సోవియట్ అనంతర రష్యాలో రికార్డు స్థాయిలో పుతిన్‌కు ఈ ఎన్నికలలో బ్రహ్మండమైన మెజార్టీ వచ్చింది. పోలయిన ఓట్లలో ఆయనకు 87.8 శాతం ఓట్లువచ్చాయి. ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఫలితాల ప్రతి దశలోనూ పుతిన్‌దే పైచేయి అయింది. కేవలం నామమాత్రపు ప్రత్యర్థులు బరిలో ఉన్నారు. కాగా తొలి ఫలితాలపై పుతిన్ స్పం దించారు. తనపై జనం ఉంచిన విశ్వాసం ఆశను ఈ వి షయం ప్రతిఫలించిందని స్పందించారు. మనం బలోపేతం అయితేనే, ఏ శక్తి మనవైపు తప్పుడు ఆలోచనలతో చూడకుండా ఉంటుంది. భయపెట్టకుండా ఉంటుంది. మన బ లంతోనే మనం ఎవరూ కూడా మన ఆత్మ విశ్వాసాన్ని, మన సొంత నిర్ణయాలను దెబ్బతీయలేరని, మనను ఎవరూ ఇంతకు ముందు ఏమీ చేయలేకపొయ్యారు. ఇకపై కూడా ఏమీ చేయలేరని పుతిన్ కార్యకర్తలతో జరిపిన సమావేశంలో పేర్కొన్నారు. తన విజయం పశ్చిమ దేశాలకు ఘా టైన సందేశం వెలువరిస్తుందని పుతిన్ ప్రకటించారు. యు ద్ధంలో కానీ శాంతిలో కానీ రష్యానే అంతా అనుసరించాల్సి ఉంటుందని తెలుసుకుంటారని తెలిపారు. కాగా మరో ఆరు సంవత్సరాల పదవీకాలం పూర్తయితే పుతిన్ రష్యా చరిత్రలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న నేతగా 200 ఏండ్ల చరిత్రలో నిలుస్తారు. జోసెఫ్ స్టాలిన్ ఘనతను కూడా తిరగరాస్తారు.
అక్రమం.. రష్యన్లకు వేరే దారిలేదు: బ్రిటన్
రష్యాలో ఎన్నికల తంతు ముగిసింది. పుతిన్ దూకుడు పద్థతుల క్రమంలో రష్యన్లకు వేరే ప్రత్యామ్నాయం లేదు. జరిగింది అక్రమ ఎన్నికల ప్రక్రియ. ఇంతకు ముందు ఉక్రెయిన్ స్వాధీన ప్రాంతాలలో కూడా ఇదే చేశారని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కెమెరూన్ స్పందించారు. అక్కడా ఇక్కడా ఎన్నికలు అన్ని ఏకపక్షంగానే సాగాయి. ఎటువంటి ఇతరత్రా పర్యవేక్షణ లేదు. శాస్త్రీయత, చట్టబద్ధత లేదని , ఎన్నికలు కేవలం మొక్కుబడి వ్యవహారం అయిందని బ్రిటన్ విమర్శించింది.
బ్యాలెట్‌పై భర్త పేరు రాసిన నావల్నీ భార్య
దేశంలో ఎన్నికలకు ఓటింగ్ వివిద దేశాలలోని రష్యా ఎంబస్సీలలో కూడా జరిగింది. కాగా బెర్లిన్ ఎంబస్సీ వద్ద క్యూలో నావల్ని భార్య యూలియా నావలనయ కూడా ఉన్నారు. ఆమెను గమనించి అక్కడున్న వారు పెద్ద ఎత్తున కరతాళధ్వనులతో ఆమె పేరు ప్రస్తావించారు. ఐదుగంటల పాటు ఆమె వరుసలో నిలబడ్డారు. ఓటేసి బయటకు వచ్చిన తరువాత విలేకరులు చుట్టుముట్టారు. ఓటేశానని అయితే బ్యాలెట్ పత్రంలో చనిపోయిన తన భర్త పేరు రాసి వేశానని తెలిపారు. కాగా పుతిన్‌కు ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? అని అడగ్గా ఇటువంటి ప్రశ్నలకు దిగకండి.పుతిన్‌కు ఎవరు సందేశాలు ఇస్తారు. ఆయనకు మాటలు , సంప్రదింపులు పనికిరావు. ఆయనో కిల్లర్, పెద్ద గ్యాంగ్‌స్టర్ అని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News