ఎర్డోగాన్‌కు తెలిపిన పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌తో చర్చించేందుకు రష్యా సిద్ధంగా ఉందని, కానీ ఆ దేశం తమ భూభాగాలు వదులుకున్నట్లు ఆమోదించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, టర్కీ నేత తయ్యిప్ ఎర్డోగాన్‌తో అన్నారని క్రెమ్లిన్ తెలిపింది. పాశ్చాత్య దేశాలు వినాశకర పాత్ర పోషిస్తున్నాయని, కీవ్‌లోకి ఆయుధాలు గుప్పిస్తున్నాయని పుతిన్ తెలిపారు.
తయ్యిప్‌తో పుతిన్ విద్యుత్‌కు సంబంధించిన అనేక సమస్యలను చర్చించారు. అక్కుయులో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించే అంశాన్ని గురించి చర్చించారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడి మొదలెట్టినప్పటి నుంచి ఎర్డోగాన్, పుతిన్‌తో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. ఉక్రెయిన్ రేవులకు గింజధాన్యాలు ఎగుమతి అయ్యేలా ఐక్యరాజ్యసమితితో పాటు టర్కీ కూడా మధ్యవర్తిగా వ్యవహరించింది. గింజ ధాన్యాల ఎగుమతితో పాటు రష్యా నుంచి ఆహార పదార్థాలు, ఎరువుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేయాలని క్రెమ్లిన్ తెలిపింది.