- Advertisement -
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారతదేశంలో పర్యటిస్తారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారు. పర్యటన తేదీలు త్వరలో ఖరారు చేస్తారని, పర్యటనకు సన్నాహాలు చేస్తున్నారని రష్యా విదేశాంగమంత్రి సెర్గి లావ్రోవ్ తెలిపారు.గత సంవత్సరం మూడో సారి ప్రధాన పదవి చేపట్టిన తర్వాత మోదీ రష్యాలోనే మొదట పర్యటించారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు మా వంతు అన్నారాయన. 2024 జూలైలో ప్రధాని మోదీ రష్యాను సందర్శించారు. ఐదేళ్ల తర్వాత మోదీ రష్యాకు రావడం ఇదే మొదటి సారి. 2019లో ఆయన చివరిసారిగా రష్యాలోని వ్లాడివోస్టాక్ లో జరిగిన ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. ఆ సందర్భంగానే మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను భారత్ కు ఆహ్వానించారు.
- Advertisement -