Thursday, November 21, 2024

నేడు ఉత్తర కొరియాకు పుతిన్

- Advertisement -
- Advertisement -

సియోల్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటనపై మంగళవారం ఉత్తర కొరియాకు వస్తున్నారని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. సైనిక సహకారం విస్తరణ లక్షంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో పుతిన్ చర్చలు జరపవచ్చు. వాషింగ్టన్‌తో విడిగా తీవ్ర స్థాయిలో ఘర్షణల నేపథ్యంలో తమ చెలిమిని వారు పటిష్ఠం చేయనున్నారు. కిమ్ ఆహ్వానంపై పుతిన్ మంగళ, బుధవారాల్లో ఉత్తర కొరియాలో అధికార పర్యటన జరుపుతారని ఉత్తర కొరియా అధికార కొరియన్ కేంద్ర వార్తా సంస్థ (సిసిఎన్‌ఎ) సోమవారం వెల్లడించింది. ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా వెంటనే ఇతర వివరాలు తెలియజేయలేదు.

రష్యా మాత్రం అదే సమయంలో ఈ పర్యటనను ధ్రువీకరించింది. కాగా, 24 ఏళ్లలో ఉత్తర కొరియాలో పుతిన్‌కు ఇదే తొలి పర్యటన. రష్యా, ఉత్తర కొరియా మధ్య ఆయుధాల సరఫరా ఒప్పందం గురించి అంతర్జాతీయంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన చోటు చేసుకుంటున్నది. కిమ్ అణ్వాయుధాలు, క్షిపణి కార్యక్రమం వల్ల ముప్పును పెంచే ఆర్థిక సహాయం, సాంకేతిక పరిజ్ఞానం బదలీకి ప్రతిగా ఉక్రెయిన్‌లో పుతిన్ యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు అవసరమైన ఆయుధాలు, ఆయుధ సామగ్రిని మాస్కోకు ప్యాంగ్‌యాంగ్ ఆ ఒప్పందం కింద సమకూరుస్తుంది. పుతిన్‌తో సమావేశం కోసం కిమ్ నిరుడు సెప్టెంబర్‌లో రష్యా తూర్పు ప్రాంతాన్ని సందర్శించినప్పటి నుంచి ఉభయ దేశాల మధ్య సైనిక, ఆర్థిక, ఇతర విధాల సహకారం బాగా పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News