Friday, November 22, 2024

పుతిన్ అణుమీట నొక్కేనా?

- Advertisement -
- Advertisement -

Putin

మాస్కో: మాస్కో అణ్వాయుధాల కార్యక్రమం లో భాగంగా రష్యా సైనిక సామగ్రి రవాణా వాహన శ్రేణి ఉక్రెయిన్ వైపు ముందుకు కదులుతోంది. ఈమేరకు ప్రత్యేక మిలిటరీ పరికరాలతో అణ్వాయుధాలతో ఆదివారం గూడ్సురైలు వెళ్తున్నట్టు ఫుటేజీ బయటపడింది. బిపిఎం 97 సాయుధ సైనిక బోగీలతో (ఆర్మ్‌ర్డ్ పెర్సనల్ క్యా రియర్స్ ఎపిసి) పాటు ఇతర సైనిక వాహనా లు వరుసగా సెంట్రల్ రష్యా మీదుగా ప్రయాణిస్తున్నట్టు క్లిప్పింగ్ టెలిగ్రాఫ్ మేసేజింగ్ యాప్‌లో పోస్ట్ అయింది. రష్యా అనుకూల ఛానెల్ రైబార్ ఆదివారం ఈ ఫుటేజిని ప్రసారం చేసిన ట్టు డైలీ మెయిల్ పేర్కొంది. ఉక్రెయిన్‌పై యు ద్ధం సాగుతున్న నేపథ్యంలో పశ్చిమదేశాలకు హెచ్చరిక సంకేతాలు పంపే లక్షంతో రష్యా అ ధ్యక్షుడు పుతిన్ అణు పరీక్షకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోందని టెలిగ్రాఫ్ పేర్కొంది. ఉక్రెయిన్ వైపు సాగుతున్న ఈ మిలిటరీ రైలులో శత్రు ప దాతి దళాల దాడులను గట్టిగా ఎదుర్కొని మ ట్టుబెట్టే అన్ని హంగులు ఉన్నాయి. టర్రెట్స్ (బురుజులు) సైనికులు ఆకస్మిక దాడి చేయడానికి కావలసిన ఆయుధాలు, ఎయిర్ ప్రూఫ్, మైన్ ప్రూఫ్ రక్షణ కవచాలు సిద్ధంగా ఉన్నాయి. నల్ల సముద్రంలో అణుసామర్ధ టార్పెడో డ్రోన్‌ను రష్యా ప్రయోగించవచ్చని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని నాటో సభ్య దేశాలకు, మిత్ర దేశాలకు నిఘా హెచ్చరికలు జారీ చేసింది. దీని పై రష్యా అణ్వాయుధ పరీక్షకు సన్నాహాలు చే స్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News