Friday, November 22, 2024

పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్నీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మాస్కో: విషప్రయోగానికి గురై జర్మనీలో ఐదునెలలు చికిత్స పొందిన అనంతరం ఆదివారం రష్యాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీని మాస్కో విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. తనపై రష్యా ప్రభుత్వం విషప్రయోగం జరిపిందని గతంలో ఆరోపించిన నవాల్నీ జర్మనీకి పారిపోయి అక్కడ చికిత్సపొందారు. పెరోల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయను మాస్కోలోని షెరెమెటీవో విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో ఒక కేసులో ఆయనకు శిక్ష పడగా అది సస్పెండ్ కావడంతో ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. కోర్టు తీర్పు వచ్చేవరకు ఆయనను కస్టడీలో ఉంచుతామని రష్యా ప్రిజన్స్ సర్వీస్ తెలిపింది. మిగిలిన మూదున్నరేళ్ల శిక్షాకాలాన్ని నవాల్నీ అనుభవించాలని తాము కోర్టును కోరతామని ప్రిజన్స్ సర్వీస్ ఇదివరకు తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాన ప్రత్యర్థి, తీవ్ర విమర్శకుడు అయిన 44 ఏళ్ల నవాల్నీ రష్యా ప్రభుత్వం తనను అరెస్టు చేయలేదని బెర్లిన్‌లో విమానం ఎక్కేముందు ధీమా వ్యక్తం చేశారు. అది అసంభవమని, తాను నిర్దోషినని ఆయన చెప్పారు.

Putin’s Critic Alexei Navalny arrested in Moscow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News