ఆక్స్‌ఫర్డ్ : రష్యాలో ఉక్రెయిన్ ఒక భాగమని గత కొంతకాలంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వాదన కొనసాగించడం అతని సామ్రాజ్య కాంక్షను బట్టబయలు చేస్తోంది తప్ప మరేం కాదు. “కీవ్ నగరం రష్యానగరాలకు తల్లివంటిది. ప్రాచీన రష్యా మా సహజమూలాధారం. ఒకదానికొకటి లేకుండా మేం బతకలేం.” 2014 మార్చిలో పుతిన్ ఒకదానిలో రాశారు. క్రిమియాను పూర్తిగా స్వాధీనం చేసుకోడానికి ముందు ఆయన ఈ ఆకాంక్షను వ్యక్తం చేశారు. 2020 జులైలో క్రెమ్లిన్ వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం ద్వారా తిరిగి ఈ లక్షాన్ని పుతిన్ వెలువరించారు. రష్యాతో భాగస్వామ్యం పొందితేనే ఉక్రెయిన్ సార్వభౌమత్వం సాధ్యమౌతుందని స్పష్టం చేశారు. ఏడు నెలల తరువాత ఈ ఉద్దేశాన్ని రెట్టింపు చేశారు. ఫిబ్రవరి 21 న గంటపాటు కొనసాగిన తన సుదీర్ఘ ప్రసంగం లో మళ్లీ తన ఆకాంక్షను లేవదీశారు.
ఉక్రెయిన్ కేవలం మా పొరుగు దేశమే కాదు, తమ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక భావాలతో కూడా విడదీయరాని భాగంగా ఉందని స్పష్టం చేయడం గమనార్హం. ఉక్రెయిన్ ప్రస్తుతం స్వతంత్ర దేశంగా కొనసాగుతున్నప్పటికీ ఆయన ఉక్రెయిన్ స్వయం ప్రతిపత్తి హక్కులను పదేపదే ఒప్పుకోడం లేదు. దీనికి బదులు ఈ రెండు దేశాల విలీనం చారిత్రక వాస్తవంగా అంగీకరించడం కనిపిస్తోంది. క్రమంగా ఈ సామ్రాజ్యవాద భావజాలం సోవియెట్ తరువాతి వ్యామోహాన్ని అధిగమించి మధ్యయుగం వైపు వెళ్తోంది. కానీ ఈ భావజాలాన్ని ఎంతవరకు రష్యన్లు పంచుకుంటారు ? ఉక్రెయిన్ తూర్పు భాగం లోని డొనెట్స్, లుహాన్స్‌లను స్వతంత్ర దేశాలుగా పుతిన్ గుర్తించినప్పుడు తాజా ఆయన ప్రసంగంలో ఉక్రెయిన్ గురించే పదేపదే ప్రస్తావించారు. రష్యా చరిత్రలో ఉక్రెయిన్ ఒక భాగమని, ఉక్రెయిన్ నైరుతిప్రాంతం చారిత్రకంగా రష్యా భూమేనని, అక్కడి రష్యన్లు తమకు తాము సనాతన క్రిస్టియన్లు రష్యావారి గానే ఇప్పటికీ భావిస్తుంటారని పేర్కొన్నారు.
ఆ తరువాత ఈ మూలాల వాదన తగ్గించి ఆధునిక ఉక్రెయిన్ పూర్తిగా రష్యా లేదా బోల్షివిక్ కమ్యూనిస్టు రష్యా నుంచే ఆవిర్భవించిందన్న వాదాన్ని బలంగా లేవదీశారు. 1917 విప్లవం తరువాతనే ఆధునిక ఉక్రెయిన్ రూపుదిద్దుకోడం ప్రారంభమైందని, లెనిన్, ఆయన సహచరులు ఉక్రెయిన్లలో చాలా మంది ఉన్నారని, అని చెబుతూ పూర్వపు రష్యా సామ్రాజ్యం లోని జాతివైవిధ్యానికి అతీతంగా ఫెడరేషన్ ఆఫ్ సోవియెట్ స్టేట్స్ (యుఎస్‌ఎస్‌ఆర్)ను లెనిన్ సృష్టియేనని ఉదహరించారు. వాస్తవానికి ఉక్రెయిన్‌కు ప్రత్యేక దేశంగా గుర్తింపు కావాలని గత రెండువందల ఏళ్లుగా ఉక్రేనియన్లు ఆకాంక్షిస్తున్నారు. ఉక్రేనియన్ హెట్‌మాంటేస్ 1710 బెండెరీ రాజ్యాంగం నుంచి 1917 లో వెస్ట్ , మరియు ఉక్రేన్ పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడిన వరకు ప్రత్యేక దేశం కావాలనే ఉక్రేనియన్ల డిమాండ్ కొనసాగుతూనే ఉంటోంది.
అలాగే పారిస్ శాంతి సదస్సులోనూ దీనిపై వినతులు వెల్లువెత్తాయి. తాము రష్యన్ల వలె కాకుండా ప్రత్యేక జాతి, సంస్కృతి కలిగిన వారమని పదేపదే నిర్ధారించుకుంటున్నారు. విప్లవం తరువాత, ఆస్ట్రో హంగేరీ సామ్రాజ్యం విచ్ఛిన్నం తరువాత రెండు యుక్రేనియన్ రిపబ్లిక్‌లను అలాగే స్వయం ప్రతిపత్తితోనే కొనసాగించాలన్న షరతులపై సోవియట్ రష్యా ఏర్పడింది. 19 వ శతాబ్దం నాటి ఉక్రెయిన్ సాహితీ సాంస్కృతిక జాతీయ ఉద్యమం నుంచి ఈ రిపబ్లిక్‌లు నేరుగా పుట్టుకొచ్చాయి. లెనిన్ నేతృత్వం లోని బోల్షివిక్కులు ఉక్రెనియన్ భూభాగాలపై నియంత్రత సాధించినప్పటికీ ఉక్రెయిన్ స్వతంత్రదేశం అన్న ఆలోచన మాత్రం విస్మరించరానిది. 1922 లో సోవియెట్ రిపబ్లిక్ కాగితాలకే ఈ హోదా పరిమితమై పోయింది. ఇవన్నీ విస్మరించి పుతిన్ తన సామ్రాజ్యవాద దాహంతో ఉక్రెయిన్ రష్యాలో భాగమే అని వాదించడం విచిత్రంగా మెజార్టీ ప్రజల అభిప్రాయం వ్యక్తమౌతోంది.