Sunday, December 22, 2024

రష్యాలో దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Putin's friend's daughter dies in Moscow explosion

కారు బాంబు పేలుడులో
పుతిన్ ఆప్తుడి కూతురు బలి
 ఉక్రెయిన్ ప్రతీకార చర్య?
 తండ్రి డుగిన్ టార్గెట్
 కారు మారడంతో యువతి మృతి

మాస్కో: రష్యాలో దారుణ హత్య జరిగింది. దేశాధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహితులు, రాజకీయవేత్త అయిన అలెగ్జాండర్ డుగిన్ కూతురు డారియా డుగినా కారు బాంబు పేలుడులో దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున మాస్కో శివార్లలో సం భవించింది. మెజాస్కౌయి హైవేపై బొల్షియా గ్రామం వద్ద ఈ దాడి పేలుడు జరిగింది. రష్యా జాతీయవాద ఆలోచనలతో ఏకంగా పుతిన్‌ను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేస్తూ పుతిన్ బ్రెయిన్‌గా అలెగ్జాండర్ డుగిన్ పేరొందారు. ఆయనకు చెందిన ఎస్‌యువి వాహనంలోనే కూతురు, 29 సంవత్సరాల యువతి రచయిత్రి, వ్యాసకర్త కూడా అయిన డారియా వెళ్లుతుండగా బాంబు పేలింది. ఆమె సజీవ దహనం అయిందని అధికారులు పేర్కొన్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. దుండగులు కారులో బాంబు పెట్టి టైమర్‌ను అమర్చినట్లు తెలుస్తోందని మాస్కో ప్రాంత దర్యాప్తు సంస్థ బృందం తెలిపింది. ఆమె తండ్రి కారులో బాంబు పెట్టి ఆయనను దుండగులు టార్గెట్ చేసుకుని ఉంటారని, అయితే కూతురు పేలుడుకు బలి అయిందని నిర్థారణకు వచ్చారు. రచయిత్రి అయిన ఆమె తండ్రితో కలిసి ఓ సాహితీ ఉత్సవంలో పాల్గొని వస్తూ ఉండగా ఘటన జరిగింది. ఇద్దరు కలిసి ఈ కారులోనే బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో తండ్రి డుగిన్ వేరే కారులో బయలుదేరాల్సి వచ్చింది. దుండగులు పథకం ప్రకారం పెట్టిన బాంబు పెట్టి ఉంచిన కారులోనే డారియా బయలుదేరారు. ఈ దశలోనే మార్గ మధ్యంలో పేలుడు జరిగింది.

పేలుడు వెనుక ఉక్రెయిన్ శక్తుల హస్తం?
పుతిన్ ఆలోచనలను తరచూ ప్రభావితం చేసే వ్యక్తిగా మారి పుతిన్ బ్రెయిన్ అని పేరు తెచ్చుకున్న అలెగ్జాండర్ డుగిన్ పుతిన్‌ను ఉక్రెయిన్ పై యుద్థానికి ప్రేరేపించారని ప్రచారం జరుగుతోంది. జాతీయవాదిగా పేరొందిన డిగిన్ రష్యా ప్రాదేశికతకు ఉక్రెయిన్‌తో సవాలు ఏర్పడుతుందని చెప్పడం వల్లనే పుతిన్ భీకరస్థాయిలో ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడినట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జోరుగా ఉంది. దీనితోనే డుగిన్‌ను టార్గెట్‌గా చేసుకునే ఉక్రెయిన్ శక్తులు దాడికి బాంబు అమర్చి రంగం సిద్ధం చేశాయని , ఇది చివరికి దారితప్పి కూతురు దారుణహత్యకు దారితీసిందని అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి.

మాది ఉగ్రదేశం కాదు : ఉక్రెయిన్
ఉక్రెయిన్‌పై వస్తున్న ఆరోపణలను ఆ దేశ అధ్యక్షులు జెలెన్‌స్కీ సలహాదారు అయిన మైకాలియో పోడోల్యక్ ఖండించారు. ఉక్రెయిన్ ఇటువంటి నేరాలకు పాల్పడదని, రష్యా మాదిరిగా వ్యవహరించదని తెలిపారు. తమది ఉగ్రదేశం కాదని ఈ విషయం అందరికీ తెలిసిందేనని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సైనిక ఇంటలిజెన్స్, ఆ దేశ సెక్యూరిటీ విభాగం రష్యాలో సంచలనానికి ఈ చర్యకు దిగాయని పుతిన్ మాజీ సలహాదారు, విశ్లేషకులు సెర్గి మార్కోవ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News