Friday, December 20, 2024

నాటోకు పుతిన్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంగా నాటో దేశాలు ఉక్రెయిన్ కు బలగాలను పంపిస్తే అణు యుద్ధం తప్పదని హెచ్చరించారు. తమ అంతర్గత వ్యవహారాలలో ఎవరినీ అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు. ఎవరైనా రష్యాను కబలించాలని చూస్తే రెండో ప్రపంచ యుద్ధం కన్నా తీవ్రమైన పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్ గురించి మాట్లాడుతూ ఆయన తాము దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుంటామన్నారు. ఉక్రెయిన్ కు చెందిన డాన్బాస్, నొవోరోస్సియా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

పాశ్చాత్య దేశాలు ఆయుధ పోటీలోకి రష్యాను లాగాలని చూస్తున్నాయన్నారు.  క్షిపణుల గురించి కూడా ఆయన ప్రసంగించారు. వచ్చే నెలలో ఎన్నికలు జరుగనుండగా ఆయన చేసిన ప్రసంగంలో ఆయన రష్యా జాతీయ ఐక్యతను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన రష్యా సైనికులను ప్రశంసించారు. పెద్ద కుటుంబాలకు పిల్లల ప్రయోజనాలు, ఇతరత్రా ప్రయోజనాలుంటాయని పుతిన్ ప్రతిపాదించారు. రష్యాలో జననాల రేటు తక్కువగా ఉన్నందున పెద్ద కుటుంబాలు మామూలు కావాలన్నారు.  జననాల రేటు తక్కువగా ఉండడం వల్ల జనాభా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News