ఖమ్మం: అన్ని మతాలను ఆదరించి సోదరభావంతో మెలిగే దేశం భారతదేశమని, పరమత సహనం భారతీయతకు మారుపేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద క్రైస్తవులకు అందిస్తున్న దుస్తులను ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ లోని సహకార నగర్ చర్చ్ లో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి ఉచిత దుస్తులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ”క్రీస్తు యేసు ప్రభు మనలను కాపాడటానికి ఈ లోకానికి వచ్చాడని, ఆ ప్రభువు వచ్చింది మత మార్పిడి కోసం కాదని.. కేవలం మనుషుల మనస్తతత్వాలను మార్చడానికే ఈ లోకానికి వచ్చాడని అన్నారు. క్రీస్తు యేసు ప్రభువు మార్గం అనుసరనియమని, ఒకే పండుగను యావత్ ప్రపంచం మొత్తం జరుపుకునేది క్రిస్మస్ అని పేర్కొన్నారు. మనలను సన్మార్గంలో నిలిపి, మనకు రక్షణను కల్పించడానికి యేసు లోకానికి వచ్చాడని, మనుషులలో ప్రేమ, శాంతి, సమాధానం నింపడానికి వచ్చారే తప్పా.. మతం మార్పిడి చేయడానికి రాలేదన్నారు.
క్రీస్తు పుట్టినరోజు అయిన క్రిస్మన్ సందర్బంగా ఆ ప్రభువు దీవెనలు మీ అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం క్రిస్మస్ పండుగను ప్రతి ఇళ్ళు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వంలో ప్రతి కులానికి, ప్రతి మతాలను గౌరవించి ప్రతి ఇంటికి సంకేమాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. మతాలకు అతీతంగా ప్రతి పండగలో మన ప్రభుత్వం భాగస్వాములై ఒకే కుటుంబం వలే సంతోషంగా పండుగ జరుపుకోవాలి అని కేసీఆర్ భావించారు” అని అన్నారు.
Puvvada Ajay Kumar distribute clothes to Christians
- Advertisement -