Monday, December 23, 2024

మొగిలయ్యను సత్కరించిన పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Puvvada ajay kumar meet with mogilaiah kinnera

హైదరాబాద్: కిన్నెర మెట్ల కళాకారుడు ద‌ర్శ‌నం మొగిల‌య్య‌కు ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మశ్రీ అవార్డును ప్ర‌క‌టించిన సందర్బంగా ఆయనను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సత్కరించారు. హైదరాబాద్ రాజధాని ఖైరతాబాద్ లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి పువ్వాడను మొగిలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడని మంత్రి ప్రశంసించారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆర్ టిసి బస్సులలో ప్రయాణం సురక్షితమని మొగిలయ్య ఆలపించిన గేయం తనను ఎంతో ఆకట్టుకుందని మంత్రి తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News