హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపడుతున్న సందర్భంగా ఖైరతాబాద్ లోని ప్రాంతీయ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం అధికారులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్, సునీల్ శర్మ, ఉన్నతాధికారులు, సిబ్బంది మంత్రి పువ్వాడ కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కేబినెట్ లో పని చేయడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కెసిఆర్ చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు. రాష్ట్ర ప్రగతిలో తనకు భాగస్వామ్యం కల్పించినందుకు వారికి తాను రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అనంతరం రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖలో ఆన్లైన్ సేవలు, పన్నులు, రిజిస్ట్రేషన్లు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కెసిఆర్ కేబినెట్ లో పనిచేయటం గర్వకారణం…
- Advertisement -
- Advertisement -
- Advertisement -