Saturday, November 9, 2024

మహిళలకు పివి సింధు స్ఫూర్తిదాయకం: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Puvvada ajay kumar praise pv sindhu

 

ఖమ్మం: ఒలింపిక్స్ లో పివి సింధు ప్రదర్శించిన ఆట, కాంస్యం సాధించిన తీరు అద్భుతమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. కాంస్య పతకం సాధించటం పట్ల ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని షటిల్ ఇండోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్య అతిధిగా హాజరై పువ్వాడ కేకే కట్ చేసి మీడియా ద్వారా సింధుకి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ఉన్న సింధు వాల్ పెయింటింగ్ కు పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి స్వీట్ తినిపించారు.

భవిష్యత్తు ఒలింపిక్స్ లో ఆడాలనుకునే మహిళలకు ఆమె గొప్ప స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దు అని చాటి చెప్పిన గొప్ప మహిళా ఒలింపియన్ సింధు అని మెచ్చుకున్నారు. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన ఏకైక భారతీయురాలుగా సింధు చరిత్ర సృష్టించారన్నారు. ఆమె ఇలాంటి మరెన్నో విజయాలు నమోదు చేసి దేశ ప్రతిష్టను, తెలుగు గౌరవాన్ని, మహిళల ఆత్మ విశ్వాసాన్ని పెంచాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అన్ని క్రీడా వసతులు కల్పించామన్నారు. ప్రతి క్రీడాకారులకు ప్రత్యేక వసతులతో కూడిన శిక్షణను ఇక్కడ ఏర్పాట్లు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News