Monday, December 23, 2024

కాంగ్రెస్ చేయలేని పనులను కెసిఆర్ చేసి చూపించారు: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులను సిఎం కెసిఆర్ చేసి చూపించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మంలో బిఆర్‌ఎస్ అభ్యర్థులతో మంత్రి పువ్వాడ సమావేశమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, జిల్లా అభివృద్ధికి నిధులు ఇచ్చిన సిఎం కెసిఆర్‌ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ తమ పథకాలకు కాపీలేనని విమర్శలు గుప్పించారు. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో మూడో సారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News